102 మంది కాంట్రాక్టర్లకు దాదాపు రూ.70 కోట్ల చెల్లింపులపై విజిలెన్స్ విచారణ
హైదరాబాద్, సెప్టెంబర్ 1, 2026 | అయుష్ 24 న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 102 మంది కాంట్రాక్టర్లకు దాదాపు రూ.70 కోట్ల మేర డబుల్ బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
విజిలెన్స్ అధికారుల ప్రాథమిక పరిశీలనలో డబుల్ బిల్లుల చెల్లింపులతో పాటు ఎక్సెస్ అమౌంట్ కూడా చెల్లించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
12 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లు వసూలు
వ్యవహారం వెలుగులోకి వచ్చిన అనంతరం సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి అదనంగా చెల్లించిన మొత్తాలను తిరిగి రాబట్టే ప్రక్రియను అధికారులు చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే 12 మంది కాంట్రాక్టర్ల నుంచి సుమారు రూ.7 కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఫైనాన్షియల్ అడ్వైజర్పై చర్యలు
డబుల్ బిల్లుల వ్యవహారానికి బాధ్యత వహించినట్లు భావిస్తూ జీహెచ్ఎంసీ ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రను విధుల నుంచి తప్పించినట్లు సమాచారం.
మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, చెల్లింపులు ఎలా జరిగాయి, బాధ్యులు ఎవరు, ప్రభుత్వానికి ఎంత మేర నష్టం వాటిల్లింది అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది










Leave a Reply