Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › జై శ్రీరామ్ తాపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

జై శ్రీరామ్ తాపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

09:10 ఉదయం AM

జాతీయ జెండాను ఆవిష్కరించిన సంఘం అధ్యక్షులు శిరమోని రాములు

దేవరకొండ, ఆగస్టు 15: దేవరకొండ పట్టణంలోని జై శ్రీరామ్ తాపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు శిరమోని రాములు జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే బాలు నాయక్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య సమరంలో ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు.

స్వాతంత్ర్య భారతదేశంలో కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. కార్మిక భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని, కార్మికులంతా ఐక్యంగా ముందుకు వచ్చి భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరవుతానని హామీ ఇచ్చారు.

అనంతరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమానికి హాజరైన కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు, కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి, సంఘం సభ్యులు, తాపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳

AYUSH 24 NEWS

THE VOICE OF TRUTH

#Ayush24News #Devarakonda #IndependenceDay2026 #BaluNaik #JaiSriramTapiWorkers #TelanganaNews #JaiHind

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 5🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *