దాత చంటి కి దేవస్థాన ఏఈఓ అభినందనలు
తిరుమల, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అవసరాల కోసం తూర్పుగోదావరి జిల్లా కడియం ఎంపీపీ అన్నదేవుల చంటి విజయ దంపతులు రూ.60 లక్షల విలువైన 50 ఆధునిక కంప్యూటర్లను విరాళంగా అందించారు.
వాస్తవానికి ఈ నెల 4న కంప్యూటర్ల కొనుగోలుకు అవసరమైన రూ.50 లక్షల చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చంటి అందజేశారు. అయితే నగదును దేవస్థానానికి జమ చేసి, తిరిగి అదే నిధులతో కంప్యూటర్లు కొనుగోలు చేయడం కంటే నేరుగా కంప్యూటర్లను బహుకరించాలని దాతలు నిర్ణయించారు. దీంతో చెక్కును వెనక్కి ఇచ్చేసి, లడ్డూ ప్రసాద కౌంటర్లు, ఇతర అవసరాల కోసం ఆధునిక 50 కంప్యూటర్లను రూ.60 లక్షలతో కొనుగోలు చేసి సోమవారం ఏఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ సందర్భంగా దాత చంటిని ఏఈఓ వెంకయ్య చౌదరి ప్రత్యేకంగా అభినందించారు. టీటీడీ సేవా కార్యక్రమాలకు అందించిన విరాళం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే చంటితో పాటు ప్రత్యేక విమానంలో తిరుమలకు వెళ్లిన ఆయన అనుచరులు 12 మందికి శ్రీవారి ప్రత్యేక దర్శనం, వసతి సదుపాయాలను దేవస్థానం కల్పించింది.










Leave a Reply