హైదరాబాద్, ఆగస్టు 25, ఆయుష్ 24 న్యూస్
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి, ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నవీన్ పెట్టం గారిని తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు కలిసి హృదయపూర్వకంగా అభినందించారు.
ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కలిసి పనిచేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో విస్తృతంగా చేరవేయాలని అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజా పాలనను మరింత బలోపేతం చేసే దిశగా సమష్టిగా కృషి చేద్దామని గుత్తా అమిత్ రెడ్డి గారు తెలిపారు.
అయుష్ 24 న్యూస్
www.ayush24news.com










Leave a Reply