రాష్ట్ర స్థాయి కరాటే, కుంఫు పోటీల్లో గోదావరిఖని క్రీడాకారుల సత్తా
గోదావరిఖని, అయుష్ 24 న్యూస్: మందమర్రి పట్టణంలో ఆదివారం బీఎంఆర్ కరాటే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే, కుంఫు టోర్నమెంట్‌లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి టోర్నమెంట్ గ్రాండ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.

ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో వివిధ విభాగాల్లో డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు.
బ్లాక్ బెల్ట్ విభాగంలో సత్తా
బ్లాక్ బెల్ట్ సీనియర్ కుమితే విభాగంలో శ్రీ హర్షిత్ గ్రాండ్ ఛాంపియన్‌గా నిలవగా, సాయి రోషన్ రన్నరప్‌గా నిలిచారు.
అలాగే బ్లాక్ బెల్ట్ సీనియర్ కాటా విభాగంలో గదార్ల సహస్ర, టింగు జయ సాయి చరణ్ గ్రాండ్ ఛాంపియన్లుగా విజయం సాధించారు.
ఆల్ కలర్ బెల్ట్ విభాగంలో పతకాల పంట
ఆల్ కలర్ బెల్ట్ కాటా విభాగంలో టీ. సాయి వైష్ణవి, ఆదిత్రి, పసునూటి అయాన్ష్, అభయ ప్రథమ బహుమతి సాధించి గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.
కుమితే విభాగంలో బొంతల సాత్విక్ గోల్డ్ మెడల్ సాధించగా, ఆదిత్రి, అయాన్ష్, అభయ ద్వితీయ బహుమతి సాధించి సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.
ఈ పోటీల్లో టీమ్ మేనేజర్లుగా యాగ్నేశ్వర్ రెడ్డి, సాయి రోషన్ వ్యవహరించారు.
విజేతలకు అభినందనలు
టోర్నమెంట్‌లో అద్భుత విజయాన్ని సాధించి గ్రాండ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ క్రీడాకారులను మాస్టర్ పసునూటి చందు, విద్యార్థుల తల్లిదండ్రులు, సీనియర్ కరాటే మాస్టర్స్, స్థానికులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయాలు సాధించి గోదావరిఖని, పెద్దపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అయుష్ 24 న్యూస్
నిజం మా ధ్యేయం… ప్రజలే మా బలం…










Leave a Reply