బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: డీఎస్పీ శివరాం రెడ్డి
నల్లగొండ: ట్రాన్స్జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలని నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నల్లగొండలో నిర్వహించిన అవగాహన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇళ్ల వద్ద బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, బెదిరించడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ట్రాఫిక్ సిగ్నల్స్, పండుగలు, శుభకార్యాల సందర్భాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ప్రజలను వేధించడం లేదా బలవంతపు వసూళ్లకు పాల్పడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
అదే సమయంలో ట్రాన్స్జెండర్లు కూడా సమాజంలో ఒక భాగమేనని, వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ప్రజల హక్కులు, స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా వ్యవహరించాలని డీఎస్పీ శివరాం రెడ్డి కోరారు.
ఈ అవగాహన సమావేశంలో సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదాబాబు, షరీఫ్‌తో పాటు పట్టణానికి చెందిన పలువురు ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply