సేవాభావంతో రక్తదానం చేస్తున్న యువత.. పలువురికి ప్రాణదానం
అయుష్ 24 న్యూస్: డాక్టర్ రాములు నాయక్ జ్ఞాపకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. డాక్టర్ రాములు నాయక్ అందించిన సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న పలువురి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యతతో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.డాక్టర్ రాములు నాయక్ సేవాభావం, మానవతా దృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రక్తదానం చేసిన యువతకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం సేవాభావానికి ప్రతీకగా నిలిచిందని, భవిష్యత్తులోనూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.










Leave a Reply