చిరుధాన్యాలు, ఆకుకూరలు, సమతుల ఆహారంపై అవగాహన
డిండి, సెప్టెంబర్ 24 (ప్రతినిధి): డిండి మండలంలో 9వ జాతీయ పోషణ మాసంలో భాగంగా చిరుధాన్యాలు, సిరిధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, సమతుల ఆహారం ప్రాముఖ్యతపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
డిండి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ ఎం. రేణుక పాల్గొని ఎస్‌హెచ్‌జీ గ్రూపుల అధ్యక్షులు, కార్యదర్శులకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. మహిళలు చిరుధాన్యాలు, సిరిధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
ప్రతి మహిళ ఇంటి వద్ద పెరటి తోటలను ఏర్పాటు చేసుకొని తాజా ఆకుకూరలు, కూరగాయలను పండించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు తీసుకోవాల్సిన పోషకాహారం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం పోషకాహారంపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సత్యవాణి, చంద్రకళ, లావణ్య, సీసీ లక్ష్మయ్య, ఎంఎస్ ప్రెసిడెంట్ అనిత, కార్యదర్శి జయమ్మ, అకౌంటెంట్ శారద, కంప్యూటర్ ఆపరేటర్ పీటర్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply