ప్రజా సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి: జనసేన నాయకుడు చందు నాయక్
దేవరకొండ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:
దేవరకొండ నియోజకవర్గంలోని నేరెడుగొమ్ము మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ తండావాసులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొరకు చందు నాయక్ మాట్లాడుతూ తండాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
అవినీతికి తావులేని, నిజాయితీతో ప్రజలకు సేవ చేసే రాజకీయ వ్యవస్థ అవసరమని చందు నాయక్ పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాగునీరు వంటి కనీస మౌలిక వసతుల కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి లేకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply