మార్చి, మే 2026 పరీక్షల పాస్ సర్టిఫికెట్లు జిల్లాలకు పంపిణీ
హైదరాబాద్, ఆగస్టు 20 — అయుష్ 24 న్యూస్:
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. మార్చి–2026 IPE, మే–2026 IPASE పరీక్షలకు సంబంధించిన జనరల్, ఒకేషనల్ పాస్ సర్టిఫికెట్లను జిల్లాలకు పంపిణీ చేసినట్లు తెలిపింది.
ఈసారి విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లను 25 అత్యాధునిక భద్రతా లక్షణాలతో, చినిగిపోని ప్రత్యేక కాగితంపై ముద్రించినట్లు పేర్కొంది. దీంతో సర్టిఫికెట్ల భద్రత, ప్రామాణికతకు మరింత భరోసా కల్పించినట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థులు తమకు సంబంధించిన జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి, రానున్న రోజుల్లో పాస్ సర్టిఫికెట్లను పొందవచ్చని సూచించారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply