కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు
హైదరాబాద్, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్:
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం.మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదికను సిద్ధం చేసి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు తెలుస్తోంది. కమిటీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన కారణాలను ముఖ్యమంత్రికి మల్లు రవి వివరించనున్నట్లు సమాచారం.క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవితో పాటు వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ ఈ వ్యవహారంపై నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయంగా ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.










Leave a Reply