గిరిజన సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
దేవరకొండ, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్
గిరిజన సర్పంచుల సమస్యల పరిష్కారంతో పాటు గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర గిరిజన సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ గిరిజన సర్పంచుల సంఘం రాష్ట్ర ఆవిర్భావ సదస్సులో దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్‌ను రాష్ట్ర అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా కొర్ర రాంసింగ్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులు అనేక సమస్యలతో వెనుకబడి ఉన్నారని అన్నారు. గిరిజన సర్పంచుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన సీనియర్ శాసనసభ్యుల్లో ఒకరికి క్యాబినెట్ మంత్రి పదవి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.30 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కొర్ర రాంసింగ్ నాయక్ తెలిపారు.










Leave a Reply