హైదరాబాద్, ఆగస్టు 24 | అయుష్ 24 న్యూస్ TAIKA మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్న తైకా ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026కు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి గాడి ప్రవీణ్ కుమార్ను నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాబోయే మెగా కరాటే పోటీల వివరాలను ఆయనకు తెలియజేసి, కార్యక్రమానికి హాజరై ప్రోత్సహించాలని కోరారు. నిర్వాహకులతో న్యాయమూర్తి సన్నిహితంగా సమావేశమై, టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు తన ఆశీస్సులు, విలువైన సూచనలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.దేశవ్యాప్తంగా కరాటే క్రీడాకారులకు ప్రతిభను ప్రదర్శించే వేదికగా ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధులు తెలిపారు.హైకోర్టు న్యాయమూర్తి అందించిన ప్రోత్సాహం తమ తైకా కుటుంబానికి మరింత ఉత్సాహాన్ని, బలాన్ని అందించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ మెగా టోర్నమెంట్ తేదీలు: సెప్టెంబర్ 5, 6, 2026.
తైకా ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌కు హైకోర్టు న్యాయమూర్తి ఆశీస్సులు
24ఆగస్టు2026
02:29 తెల్లవారుజాము AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply