మంథని, ఆగస్టు 29, 2026: మంథని మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన అప్పల పర్వతాలు తండ్రి అప్పల అంకుల్ దశదిన కార్యక్రమంలో మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్ పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అప్పల అంకుల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అయిలి ప్రసాద్, ఆయన జ్ఞాపకాలను, మంచితనాన్ని గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుదుదుల వెంకన్న, నగరంపల్లి సర్పంచ్ శ్రీనివాస్, ఆరెంద సర్పంచ్ రామస్వామి, భట్టుపల్లి సర్పంచ్ స్వరూప–శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply