సెప్టెంబర్ 3 నుంచి 7 వరకు మౌఖిక పరీక్షలు
దేవరకొండ, ఆగస్టు 31: దేవరకొండ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు (మౌఖిక పరీక్షలు) నిర్వహిస్తున్నట్లు సీడీపీవో చంద్రకళ తెలిపారు.
సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ విద్యార్హత పత్రాలు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాలని సీడీపీవో సూచించారు.
సరైన ధ్రువపత్రాలు లేని అభ్యర్థులను ఇంటర్వ్యూకు అనుమతించబోమని ఆమె స్పష్టం చేశారు.
అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply