Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండలో ఘనంగా ఉట్ల సంబరాలు
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండలో ఘనంగా ఉట్ల సంబరాలు

01:44 తెల్లవారుజాము AM

భారీగా హాజరైన పట్టణ ప్రజలు

సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉట్ల పండుగ

పోటీపడి ఉట్లు కొట్టిన యాదవ సోదరులు

దేవరకొండ, సెప్టెంబర్ 5: శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (పెద్ద రామాలయం)లో యాదవ సోదరుల ఆధ్వర్యంలో ఉట్ల పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పట్టణ ప్రజలు వందలాదిగా హాజరై ఉత్సవాలను తిలకించారు.

పెద్ద రామాలయం ధర్మకర్త పగిడిమర్రి రఘురాములు సోదరి పగిడిమర్రి రాధా రాణి ఉట్లను లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యాదవ సోదరులు ఉత్సాహంగా పోటీపడి ఉట్లు కొట్టారు. సుమారు రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.

రామాలయం నుంచి శివవాద్యాలు, బాజాభజంత్రీలతో ఉట్ల వేదిక వద్దకు చేరుకున్న ధర్మకర్తలు, యాదవ సోదరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్ల పండుగను ప్రారంభించారు. యువత ఉత్సాహంగా పాల్గొని ఒకరిపై ఒకరు పోటీపడుతూ ఉట్లు కొట్టడంతో కార్యక్రమ ప్రాంగణం కేరింతలతో మార్మోగింది.

సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న యాదవ సోదరులు

ఈ సందర్భంగా ధర్మకర్త పగిడిమర్రి రఘురాములు మాట్లాడుతూ.. యాదవులు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు నిర్వహించి ఉట్లు కొట్టే సంప్రదాయం అనేక సంవత్సరాలుగా కొనసాగుతోందన్నారు. కుటుంబ వారసులు సైతం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఉట్ల పండుగలో పాల్గొంటున్నారని తెలిపారు.

ఉట్లు కొట్టిన యాదవ సోదరులను ఆలయ ధర్మకర్తలు, లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పగిడిమర్రి రాధా రాణి కూడా ఉత్సాహంగా పాల్గొన్న యాదవ సోదరులను అభినందించారు.

ఆకట్టుకున్న బూరెలు లాగే కార్యక్రమం

అనంతరం నిర్వహించిన బూరెలు లాగే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువత ఒకరిపై ఒకరు ఎక్కుతూ ఒంటి స్తంభంపైకి చేరుకుని, చివరకు పైభాగంలో ఉంచిన బూరెలను లాగేందుకు పోటీపడ్డారు. ఈ దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు, పట్టణ ప్రజల కేరింతల మధ్య ఉట్ల సంబరాలు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా కొనసాగాయి.

పలువురు ప్రముఖుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, నక్క వెంకటేష్ యాదవ్, నేతాల వెంకటేష్ యాదవ్, వార్డు కౌన్సిలర్ పులిజాల భవాని జానీ, పులిజాల శ్రీనివాసులు, పగిడిమర్రి రాధా రాణి, చెరిపెల్లి జయలక్ష్మి, లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, లయన్స్ క్లబ్ జోన్ చైర్‌పర్సన్ ఉషారాణి, సంగిశెట్టి జ్యోత్స్న, సన్నీ, హనుమంతు, సాయి చంద్ర గౌడ్‌తో పాటు యాదవ సోదరులు, భక్తులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 587🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *