రామ్ రామ్ బంజారా సేవ సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 26 వరకు ఉత్సవాలు
దేవరకొండ, ఆగస్టు 16: బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే తీజ్ పండుగ ఉత్సవాలను దేవరకొండలో ఘనంగా నిర్వహించేందుకు రామ్ రామ్ బంజారా సేవ సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు తీజ్ పండుగ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు రమావత్ వంశీ తెలిపారు.

ఆదివారం దేవరకొండలోని స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఉత్సవాల వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా రమావత్ వంశీ మాట్లాడుతూ.. బంజారా ఆడబిడ్డలకు తీజ్ పండుగ ఎంతో ప్రత్యేకమైనదని, బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పండుగను ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని తెలిపారు. సాంప్రదాయ దుస్తులు ధరించి నిష్ఠతో విత్తనాలను నాటి, అవి మొలకెత్తిన అనంతరం వాటిని ఎత్తుకుని ఉత్సవాలు నిర్వహించడం బంజారా సంస్కృతిలో ప్రత్యేకమైన సంప్రదాయమని పేర్కొన్నారు.

దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి వార్డు, గ్రామం, తండా నుంచి బంజారా సోదరీమణులు, సోదరులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీజ్ ఉత్సవాలను విజయవంతం చేయాలని రామ్ రామ్ బంజారా సేవ సంఘ్ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రమావత్ వంశీ, కార్యదర్శి నేనావత్ మాతృ, ప్రధాన కార్యదర్శి జాతవత్ జయప్రకాశ్, కోశాధికారి నేనావత్ రాజు, నాగార్జున, సోషల్ మీడియా కన్వీనర్ రామావత్ రాంబాబు నాయక్, మాకట్లల్, శంకర్, వినోద్, నాగరాజు, ఈశ్వర్, తిరుపతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply