రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
దేవరకొండ, ఆగస్టు 25 — అయుష్ 24 న్యూస్:
దేవరకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం (మార్కెట్ ఆఫీస్)లో జరిగిన ఈ కార్యక్రమంలో దేవరకొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారుపాకుల సురేష్ గౌడ్, చందంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొండేటి మల్లారెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, వాటి ద్వారా నేటికీ పేద, బడుగు వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆయన అనేక కీలక సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ దేవరకొండ మండల అధ్యక్షులు ముకురోజు రాజు, కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు మెడ సైదయ్య, మూడవత్ సాగర్ నాయక్, ఉమర్ ఖాసీం, నేనావత్ మోతిలాల్, పులిజాల వెంకటయ్య, దుబ్బ చరణ్, కొర్ర కుమార్, పోతురాజు ధనరాజ్, కావటి లింగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ రావు, నోముల యాదయ్య, కొమ్మనమోని విజయ్, రామకృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply