పీఏపల్లి మండల ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానం
దేవరకొండ, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
దేవరకొండ పట్టణంలోని 17వ వార్డు సంజయ్ కాలనీకి చెందిన పలువురు యువకులు బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు వడ్త్య రమేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. దేవరకొండలోని ఆయన నివాసంలో యువకులు ఆయనను కలిసి పలు విషయాలపై మాట్లాడారు.
అదేవిధంగా పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమానికి సంబంధించి గ్రామ దేవాలయ కమిటీ భక్త బృందం వడ్త్య రమేష్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందించింది.

విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్త బృందం ఆయనను ఆహ్వానించినట్లు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply