మండల స్థాయిలోనే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం
దేవరకొండ | అయుష్ 24 న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలోనూ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేవరకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి ఎంపీడీవో ఆర్. సాగర్ తెలిపారు.
రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజనల్ స్థాయిల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం తరహాలోనే మండల స్థాయిలోనూ ప్రజల సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మండల స్థాయికి చెందిన 23 శాఖల అధికారులు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. తద్వారా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే పరిష్కారం పొందే అవకాశం కలుగుతుందని అన్నారు.
ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తారని ఇన్‌చార్జి ఎంపీడీవో ఆర్. సాగర్ తెలిపారు.
దేవరకొండ మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply