మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మున్సిపల్ చైర్పర్సన్కు వినతిపత్రాలు అందించిన పట్టణ పద్మశాలి మహిళా సంఘం
దేవరకొండ, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: దేవరకొండ ఖిల్లా దుర్గానికి చెందిన చారిత్రక శిల్పకళా సంపదను పరిరక్షిస్తూ, పురాతన శిల్పాలకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతూ దేవరకొండ పట్టణ పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో సోమవారం అధికారులకు వినతిపత్రాలు అందించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, తహసీల్దార్ సంజీవ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లుకు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మహిళా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. గతంలో దేవరకొండ ఖిల్లా దుర్గం నుంచి సేకరించిన చారిత్రక విగ్రహాలను ఫిరంగి తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరిచారని తెలిపారు. ప్రస్తుతం ఆ విగ్రహాలు చెత్తాచెదారం మధ్య ఉండటంతో పాటు, అక్కడ మూత్ర విసర్జన జరుగుతున్న కారణంగా దేవతా విగ్రహాల పవిత్రత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ విగ్రహాలను దేవరకొండ ఖిల్లా పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, సురక్షితంగా పరిరక్షించాలని వారు అధికారులను కోరారు. తద్వారా ఖిల్లా చారిత్రక వైభవాన్ని భావితరాలకు అందించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు చేరిపల్లి జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గంజి యాదమ్మ, కోశాధికారి సంగిశెట్టి జ్యోత్స్న, మునగపాటి చంద్రకళ, చిలుకూరి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ | The Voice of Truth










Leave a Reply