దేవరకొండ ప్రతినిధి | సెప్టెంబర్ 9 | అయుష్ 24 న్యూస్
తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా ఉద్యమాల స్ఫూర్తిదాత కాళోజీ నారాయణరావు నేటి తరానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని దేవరకొండ మున్సిపల్ కమిషనర్ రామదుర్గా రెడ్డి అన్నారు.
కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని బుధవారం దేవరకొండ పురపాలక సంఘం కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ రామదుర్గా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సామాజిక చైతన్యం కోసం కాళోజీ నారాయణరావు చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రజా సమస్యలను తన రచనల ద్వారా ఎత్తిచూపిన కాళోజీ జీవితం, సాహిత్యం నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply