ఫోటో, వీడియోగ్రఫీ అసోసియేషన్ సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తా: 17వ వార్డు కౌన్సిలర్ పొట్ట మధు
పొట్ట మధును ఘనంగా సన్మానించిన అసోసియేషన్ సభ్యులు
దేవరకొండ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:
ఫోటో, వీడియోగ్రఫీ వృత్తి తనను ఉన్నత స్థితికి తీసుకువచ్చిందని, అందుకే ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ భవన అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తున్నానని దేవరకొండ పట్టణ 17వ వార్డు కౌన్సిలర్ పొట్ట మధు అన్నారు.
దేవరకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో నిర్మిస్తున్న ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ భవన నిర్మాణానికి రూ.50,116 విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా పొట్ట మధు మాట్లాడుతూ తాను అందిస్తున్న విరాళం ఫోటో, వీడియోగ్రఫీ వృత్తి ద్వారా సంపాదించిన ఆదాయం నుంచే అందిస్తున్నానని తెలిపారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి భవిష్యత్తులోనూ తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
వీడియో, ఫోటోగ్రఫీ నుంచి వార్డు కౌన్సిలర్‌గా…

ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌గా వృత్తిని కొనసాగిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన పొట్ట మధును ప్రజలు ఎన్నికల్లో ఆదరించి వార్డు కౌన్సిలర్‌గా ఎన్నుకున్నారని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ఫోటో, వీడియోగ్రాఫర్లు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ సమాజంతో సన్నిహితంగా ఉంటారని పేర్కొన్నారు. అలాంటి వృత్తి నుంచి ఎదిగి ప్రజా ప్రతినిధిగా సేవలందిస్తున్న పొట్ట మధు తమ అసోసియేషన్‌కు గర్వకారణమని అన్నారు.
అనంతరం పొట్ట మధును అసోసియేషన్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జయరాం, భాస్కర్, మణిదీప్, హనుమంతు, రిషి, మంజునాథ్, సలీం, అంజి, శీను, శివ తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply