అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తా
దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):
దేవరకొండ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కలారు సందీప్, ప్రధాన కార్యదర్శి పదవికి గోపాల్, కోశాధికారి పదవికి మంజు పోటీ చేశారు.
మొత్తం 191 ఓట్లు పోలవగా, అందులో 168 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అధ్యక్ష పదవికి కలారు సందీప్‌కు 97 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి గణేష్‌కు 71 ఓట్లు వచ్చాయి. దీంతో 26 ఓట్ల ఆధిక్యంతో కలారు సందీప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఎన్నిక అనంతరం కలారు సందీప్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఫోటో, వీడియో గ్రాఫర్స్ సభ్యులందరినీ సమన్వయంతో కలుపుకొని, వారి సలహాలు, సూచనల మేరకు పనిచేస్తానని తెలిపారు.
అసోసియేషన్ భవన నిర్మాణానికి కూడా తన వంతుగా కృషి చేస్తానని సందీప్ హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కలారు సందీప్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.










Leave a Reply