దేవరకొండ బొడ్రాయి బజార్‌లో వైభవంగా శ్రీ మహాంకాళి బోనాల పండుగ
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు నేనావత్ కిషన్ నాయక్
దేవరకొండ, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే శ్రీ మహాంకాళి బోనాల పండుగను దేవరకొండ పట్టణంలోని బొడ్రాయి బజార్‌లో భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు నేనావత్ కిషన్ నాయక్ శ్రీ మహాంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా వర్ధిల్లాలని శ్రీ మహాంకాళి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్, స్థానిక కౌన్సిలర్లు అంజి గౌడ్, పొట్ట మురళి, పులిజాల జానీ, పార్టీ నాయకులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Mahamood Mohammed






Leave a Reply