ఇంటింటికీ మొక్కల పంపిణీ
90 వేల మొక్కలను నాటడమే లక్ష్యం
దేవరకొండ, ఆగస్టు 25, ఆయుష్ 24 న్యూస్:
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజా వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం దేవరకొండ ఖిల్లాలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 50 మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పున్న శైలజా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో 90 వేల మొక్కలను నాటడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొక్కలు నాటాల్సిన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయడంతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే మొక్కలు నాటాల్సి ఉన్నప్పటికీ ఎలినో ప్రభావం కారణంగా కొంత ఆలస్యమైందని తెలిపారు. నేటి నుంచి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.
నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత మున్సిపాలిటీతో పాటు ఆయా వార్డుల ప్రజలు కూడా తీసుకోవాలని, మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఏ. సంజీవయ్య, మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, పర్యావరణ పరిరక్షణ అధికారి శక్రు నాయక్, ఏఈ రాజు, అర్చన, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ గౌడ్, జగమంతు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

— ఆయుష్ 24 న్యూస్










Leave a Reply