ప్రధాన కార్యదర్శిగా కొండోజు శ్రీనివాసచారి ఎన్నిక
స్వర్ణకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తాం
దేవరకొండ, సెప్టెంబర్ 10 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ స్వర్ణకార సంఘం ఎన్నికలు గురువారం పట్టణంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కాసుల వెంకటాచారి, ప్రధాన కార్యదర్శిగా కొండోజు శ్రీనివాసచారి ఎన్నికయ్యారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన కాసుల వెంకటాచారి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించిన ప్రతి స్వర్ణకారునికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో సుమారు పదేళ్ల పాటు సెక్రటరీగా పనిచేశానని, సంఘ సభ్యులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, సంఘ అభివృద్ధికి ప్రతి స్వర్ణకారుని మద్దతు తీసుకుని బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు.
ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కొండోజు శ్రీనివాసచారి మాట్లాడుతూ.. ఇది తన వ్యక్తిగత విజయం కాదని, స్వర్ణకార సంఘం సభ్యుల విజయంగా భావిస్తున్నానని అన్నారు. తన ఎన్నిక కోసం కృషి చేసిన చేపూరి జగన్చారి, సిరిగెద్దె విఠలాచారి, కూరెళ్ల కృష్ణమాచారి, ఇతర సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అందరినీ కలుపుకుని సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు
స్వర్ణకార సంఘం ఎన్నికలు ప్రశాంతమైన, స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని చేపూరి జగన్చారి, సిరిగెద్దె విఠలాచారి, కృష్ణమాచారి తెలిపారు. అధ్యక్షుడిగా కాసుల వెంకటాచారి, ప్రధాన కార్యదర్శిగా కొండోజు శ్రీనివాసచారి ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో నూతన కార్యవర్గానికి మద్దతుగా నిలిచిన ప్రతి స్వర్ణకారునికి కృతజ్ఞతలు తెలిపారు.
నూతన అధ్యక్ష, కార్యదర్శులకు ఘన సన్మానం
ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా స్వర్ణకార సంఘం సభ్యులు బాణాసంచా కాల్చి స్వర్ణకార వీధిలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నూతన అధ్యక్షుడు కాసుల వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి కొండోజు శ్రీనివాసచారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులు, సంఘ పెద్దలు, ఇతరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply