Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
Home › బ్రేకింగ్ న్యూస్ › దొడ్డి అశోక్–సువర్ణల కాంప్లెక్స్‌లో కొలువుదీరిన మట్టి వినాయకుడు
బ్రేకింగ్ న్యూస్

దొడ్డి అశోక్–సువర్ణల కాంప్లెక్స్‌లో కొలువుదీరిన మట్టి వినాయకుడు

10:56 ఉదయం AM

ఐదో రోజు ఘనంగా పూజలు.. నేడు మట్టి వినాయకుడి నిమజ్జనం

దేవరకొండ, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): దేవరకొండ పట్టణంలోని దొడ్డి అశోక్–సువర్ణల కాంప్లెక్స్‌లో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడికి ఐదో రోజు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దొడ్డి అశోక్–సువర్ణ దంపతులతో పాటు డాక్టర్ తేజస్విని, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సంధ్య, స్వాతి తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

శుక్రవారం సందర్భంగా స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా దొడ్డి అశోక్ మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడిని తొలి పూజతో ఆరాధించడం ద్వారా ఆటంకాలు తొలగి, అన్ని శుభాలు కలుగుతాయని అన్నారు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా విఘ్నేశ్వరుడిని ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు.

డాక్టర్ తేజస్విని, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సంధ్య మాట్లాడుతూ చిన్ననాటి నుంచి వినాయక చవితి పండుగ అంటే ఎంతో సంతోషంగా ఉండేదని, వినాయక మండపాల వద్ద నవరాత్రులను ఆటపాటలతో ఉత్సాహంగా గడిపేవారమని గుర్తుచేశారు. దేవరకొండలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం అభినందనీయమని, పర్యావరణ పరిరక్షణకు దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు. నవరాత్రుల సందర్భంగా తాము కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు.

నేడు మట్టి వినాయకుడి నిమజ్జనం

దొడ్డి అశోక్–సువర్ణల కాంప్లెక్స్‌లో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడికి ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం శనివారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మట్టి వినాయకుడితో పాటు మొక్కలను కూడా భక్తులకు అందించినట్లు పేర్కొన్నారు. నిమజ్జనంలో భాగంగా మండపం వద్ద ఏర్పాటు చేసిన నీటిలో మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసి, ఆ మట్టిని నాటిన మొక్కలకు వినియోగించనున్నట్లు తెలిపారు.

నిమజ్జన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 53🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
220 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App