శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.25,000 విరాళం అందజేత
దోమ, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: దోమ మండలం ఉదాన్‌రావ్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ద్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరై శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం రూ.25,000 విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
ద్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply