Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి
Home › బ్రేకింగ్ న్యూస్ › నంది అవార్డు అందుకున్న రచ్చ ఉపేందర్
బ్రేకింగ్ న్యూస్

నంది అవార్డు అందుకున్న రచ్చ ఉపేందర్

03:11 మధ్యాహ్నం PM

గ్లోబల్ ఎక్సలెంట్ ఐకాన్ 2026 అమేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్స్‌లో ప్రజా సేవకుడిగా సత్కారం

దేవరకొండ, సెప్టెంబర్ 20 (ప్రతినిధి): ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో కలిసి సామాజిక సేవలు అందిస్తున్న రచ్చ ఉపేందర్‌కు గ్లోబల్ ఎక్సలెంట్ ఐకాన్ 2026 అమేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్స్‌లో భాగంగా నంది అవార్డు అందజేశారు.

ఆదివారం హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ క్లబ్‌లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో నిర్వాహకులు షియాన్స్ అమర్ సింగ్, కేశవ్ గౌడ్, చైతన్య రచ్చ ఉపేందర్‌ను అభినందించి అవార్డు, జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన రచ్చ ఉపేందర్ వృత్తిరీత్యా చేనేత కార్మికుడని తెలిపారు. తన వృత్తిని కొనసాగిస్తూనే ప్రజాక్షేత్రంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారని తెలిపారు.

సామాన్య జీవితం నుంచి ప్రారంభమైన రచ్చ ఉపేందర్ ప్రయాణం, ప్రజా సేవలో ఆయన చూపుతున్న కృషి, పట్టుదల, అంకితభావం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దేవరకొండ పట్టణానికి చెందిన ముసిని అంజన్, ముసిని అంజిబాబు తదితరులు రచ్చ ఉపేందర్‌ను అభినందించారు. కృషి, పట్టుదల, అంకితభావంతో ప్రజా సేవలో కొనసాగుతున్న ఆయనలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల అభినందనలు

గ్లోబల్ ఎక్సలెంట్ ఐకాన్ 2026 అమేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంది అవార్డు అందుకున్న రచ్చ ఉపేందర్‌కు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన భార్య రచ్చ నిర్మల, కుమారుడు రచ్చ సాయికుమార్, కుమార్తె, అల్లుడు కాటబత్తిని కావ్య, కాటబత్తిని సంపత్ కుమార్, వియ్యంకులు కాటబత్తిని నరసింహ, శోభారాణితో పాటు సోదరులు రచ్చ వెంకటేష్, రచ్చ బుచ్చి రాములు, రచ్చ చంద్రశేఖర్ తదితరులు అభినందనలు తెలిపారు.

ప్రజా సేవకు గుర్తింపుగా లభించిన ఈ అవార్డు రచ్చ ఉపేందర్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 258🔗 Shares: 4👍 Likes: 2
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
220 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App