నల్లగొండ, 28అక్టోబర్ (ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ) :
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతు డిక్లరేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 2న నల్లగొండ పట్టణంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రజా పోరాట సమితి (PRPS), బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ నూనె వెంకట్ స్వామి తెలిపారు.
ఈ మేరకు నార్కెట్పల్లి మండలంలోని మాండ్ర, జువ్విగూడెం, తొండ్లాయి, అక్కెనపల్లి, అమ్మనబోలు, నెమ్మని, నార్కెట్పల్లి, ఔరవాణి, చౌడంపల్లి, చిన్నతుమ్మలగూడెం తదితర గ్రామాలలో నిర్వహించిన సన్నాహక సమావేశాలలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చేవెళ్లలో జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్, వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసిందని, ప్రస్తుతం వాటి అమలు ఏ విధంగా ఉందనే అంశంపై చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నల్లగొండలోని ఎస్.బి.ఆర్. ఫంక్షన్ హాల్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.
సామాజిక తరగతుల ప్రయోజనాల కోసం పనిచేసే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశాలలో పి.ఆర్.పి.ఎస్ నాయకులు బర్రె సంజీవ, బర్రె శేఖర్, దొండ నరసింహ యాదవ్, ఏర్పుల లింగస్వామి యాదవ్, చింతా ప్రవీణ్, తిరగమల్ల యాదగిరి, బాతుక మల్లేష్ యాదవ్, బొల్లు యాదగిరి, రాపోలు రంగయ్య, బొందు కృష్ణయ్య యాదవ్, గాదె రాములు, చినపాక రాములు, కన్నెబోయిన సైదులు యాదవ్, నారబోయిన సైదులు యాదవ్, మెడబోయిన సత్తయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో నవంబర్ 2న బిఎల్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి
నల్లగొండ, 28అక్టోబర్ (ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతు డిక్లరేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 2న నల్లగొండ పట్టణంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply