అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నాయకుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే
కరీంనగర్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): ముత్తారం మాజీ జడ్పీటీసీ, సీనియర్ నాయకులు నాగినేని జగన్ మోహన్ రావును మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. కరీంనగర్లోని జగన్ మోహన్ రావు నివాసానికి వెళ్లిన పుట్ట మధూకర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు త్వరగా కోలుకోవాలని పుట్ట మధూకర్ ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం నాగినేని జగన్ మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ వెంట కాటారం ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు బండం వసంత రెడ్డి, ముత్తారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ, ముత్తారం సర్పంచ్ సుదాటి రవీందర్ రావు, మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కూరాకుల ఓదెలు తదితరులు ఉన్నారు.









Leave a Reply