Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › నాగేపల్లి అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
బ్రేకింగ్ న్యూస్

నాగేపల్లి అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ

04:33 సాయంత్రం PM

శ్రావణమాస ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్

రామగిరి: రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.. అభయాంజనేయ స్వామి ఆశీస్సులు మంథని నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.

సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. ఏటా భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆలయ దేవస్థాన కమిటీ సభ్యులను, నాగేపల్లి గ్రామస్తులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎల్లే రామ్మూర్తి, కార్యదర్శి రోడ్డ బాపన్న పటేల్, నాగేపల్లి సర్పంచ్ కొండవేన దివ్య సుధాకర్, రామగిరి మండల బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం, మాజీ సర్పంచ్ ఎరుకల కొండవేన ఓదెలు, నాగేపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు తీగల సదయ్య, లద్నాపూర్ మాజీ ఉపసర్పంచ్ తొగరి లింగయ్య, కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి రాజమల్లు, రామగిరి మండల ఆర్ఎంపీ–పీఎంపీ సంఘం అధ్యక్షులు బొద్దుల జగదీశ్వర్, లద్నాపూర్ కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు గిరవేన రాములు యాదవ్, వార్డు సభ్యులు మైలారపు అనిల్, పందుల సోమ్, కొండవీణా ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు చింతం మహేందర్, తొట్ల సదయ్య, జక్కుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

– అయుష్ 24 న్యూస్ ప్రతినిధి

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 23🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *