Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › నిరంతర కృషికి గుర్తింపు.. ఉత్తమ ఉపాధ్యాయుడిగా జి. రాజు
బ్రేకింగ్ న్యూస్

నిరంతర కృషికి గుర్తింపు.. ఉత్తమ ఉపాధ్యాయుడిగా జి. రాజు

అమ్రాబాద్: విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, గురుకుల ప్రవేశాల్లో విశేష ఫలితాలు సాధించిన కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జి. రాజుకు అమ్రాబాద్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు లభించింది. జి. రాజు ఉపాధ్యాయుడిగా 20-06-2022న కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరారు. ఆయన

01:47 మధ్యాహ్నం PM

అమ్రాబాద్: విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, గురుకుల ప్రవేశాల్లో విశేష ఫలితాలు సాధించిన కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జి. రాజుకు అమ్రాబాద్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు లభించింది.

జి. రాజు ఉపాధ్యాయుడిగా 20-06-2022న కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరారు. ఆయన పాఠశాలలో చేరిన సమయంలో కేవలం 15 నుంచి 18 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. విద్యార్థుల సంఖ్యతో పాటు వారి విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, నిరంతరం కృషి చేశారు.

2022–23 విద్యా సంవత్సరంలో 4వ తరగతి విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో 4/4 సీట్లు సాధించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 28కు పెరిగింది.
2023–24 విద్యా సంవత్సరంలో 6/6 గురుకుల సీట్లు సాధించి మరోసారి తన ప్రతిభను చాటారు. ఆ తరువాత పాఠశాల విద్యార్థుల సంఖ్య 38కు చేరింది.
2024–25 విద్యా సంవత్సరంలో 8/8 గురుకుల సీట్లు సాధించి అద్భుతమైన ఫలితాన్ని నమోదు చేశారు.
2025–26 విద్యా సంవత్సరంలో 8 గురుకుల సీట్లలో 4 సీట్లు సాధించారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బోధనా పద్ధతులతో పాటు, వ్యక్తిగత శ్రద్ధ, నిరంతర పర్యవేక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దిన జి. రాజు కృషిని గుర్తించిన అమ్రాబాద్ మండల అధికారులు మండల ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా జి. రాజు మాట్లాడుతూ, “నా పని విధానాన్ని, నిరంతర కృషిని, నా ప్రతిభను గుర్తించి ఈ అవార్డును అందించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ గౌరవం నా ఒక్కరి విజయం కాదు. నా కుటుంబ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కొత్తపల్లి గ్రామ ప్రజల సహకారం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగాను. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

కొత్తపల్లి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు, గురుకుల ప్రవేశాల్లో వరుసగా మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల గ్రామస్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు జి. రాజును అభినందించారు. 👏👏

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 59🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
98 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App