లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ఇల్లందు, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): కోయగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దంతెల తండాలో లబ్ధిదారులు భూక్యా కోటి–లలిత దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులను అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన సొంత గృహాన్ని అందించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల ద్వారా తమ సొంతింటి కల నెరవేరుతున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాలకు సొంత గృహాలను అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్–ఉమా దంపతులు, సర్పంచ్ కోరం సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply