భాకాపూర్‌లో రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం
పూడూరు, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: పూడూరు మండలం భాకాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, లబ్ధిదారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కీలకంగా నిలుస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సొంతింటి కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply