వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన జ్యోతి ప్రసన్న, దేవరన్ నాయక్
దేవరకొండ, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్: నేరేడుగొమ్ము మండల కేంద్రం సర్పంచ్ పులికంటి సుధాకర్ బావమరిది మారేపల్లి సుభాష్–మిన్ను వివాహ వేడుక శనివారం పోలేపల్లి ధనలక్ష్మి గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ సతీమణి శ్రీమతి జ్యోతి ప్రసన్న, వారి కుమారుడు, యువజన కాంగ్రెస్ నాయకుడు నేనావత్ దేవరన్ నాయక్ హాజరయ్యారు. నూతన వధూవరులను కలిసి పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన దంపతులు పరస్పర ప్రేమానురాగాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వివాహ వేడుకలో ఆత్మీయంగా పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
పలువురు కాంగ్రెస్ నాయకుల హాజరు
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ముక్కమల వెంకటయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి లోకసాని కృష్ణయ్య, చందంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, దేవరకొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, మాజీ ఎంపీటీసీలు గిరి యాదయ్య, గడ్డం వెంకటయ్య, పొట్టెపాక మురళీకృష్ణ, సురేందర్‌రెడ్డి, ముక్కమల శ్రీను, గిరి చెన్నకేశవులు, నాగటి హరీష్, కొత్త వెంకటయ్య, పులికంటి ముత్యాలు, నేనావత్ కుమార్, కుంభం రామకృష్ణ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.










Leave a Reply