వివాహ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
కొండమల్లెపల్లి: దేవరకొండ నియోజకవర్గం కొండమల్లెపల్లి టౌన్‌లోని విజయలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకకు బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ హాజరయ్యారు.
కొండమల్లెపల్లి మండలానికి చెందిన జెల్ల వెంకటమ్మ–పుల్లయ్య యాదవ్ దంపతుల కుమారుడు పురుషోత్తం, అంజలి వివాహ వేడుకలో పాల్గొన్న వడ్త్య రమేష్ నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వధూవరుల కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకలో పాల్గొన్న బంధుమిత్రులు, నాయకులు నూతన దంపతులకు శుభాకాంక్షలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దిశెట్టి సత్యం, పాండు, అజ్మాపురం మాజీ సర్పంచ్ రామకృష్ణ, రాజు, జెల్ల పుల్లయ్య, శేఖర్, దేవేందర్, అనిల్, దుర్గాప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply