మంత్రి శ్రీధర్ బాబు చొరవకు, తిరుపతి యాదవ్ సహకారానికి కృతజ్ఞతలు
రామగిరి, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
ఎన్నో ఏళ్లుగా రామగిరి మండల ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదురుచూస్తున్న భవన నిర్మాణ కల ఎట్టకేలకు సాకారమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో పాటు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ కృషితో భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రామగిరి మండల ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్‌రోడ్‌లోని మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ భవన నిర్మాణ కలను సాకారం చేసేందుకు చొరవ చూపిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, నిధుల మంజూరులో సహకరించిన తొట్ల తిరుపతి యాదవ్‌కు అసోసియేషన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.ఎస్. అన్వర్, రామగిరి ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దుల జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి గండి పైడయ్య, క్యాషియర్ సందీప్‌తో పాటు రామగిరి మండల ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply