విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన నీలం మదన్న
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్:
నాగర్కర్నూల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న పండుగ సాయన్న విగ్రహానికి నీలం మదన్న ఆర్థిక సహాయం అందించారు. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన నిధుల కోసం నిర్వాహకులు కోరిన వెంటనే చెక్కును అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
గత కొంతకాలంగా నాగర్కర్నూల్ పట్టణ కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. నీలం మదన్న అందించిన సహకారంతో విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలకు మరింత ఊపందుకున్నట్లు తెలిపారు.
విగ్రహ ఆవిష్కరణ రోజున నాగర్కర్నూల్ పట్టణ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సభకు సుమారు 10 వేల మందిని సమీకరించే లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా నీలం మదన్నకు నాగర్కర్నూల్ జిల్లా తెనుగోళ్ల జాతి పక్షాన నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకరబోయిన మహేష్, తెర్పోల్ సర్పంచ్ సతీష్, వాకిటి ఆంజనేయులు, నాగర్కర్నూల్ డీఎఫ్సీఎస్ చైర్మన్ తెప్ప బాబు, డీఎఫ్సీఎస్ డైరెక్టర్, కేసరి సముద్రం అధ్యక్షులు, పెబ్బేటి ధనుంజయ్, చెంది నర్సయ్య, శేఖర్, మంజుల రాముడు, తిమ్మాజిపేట మండల అధ్యక్షులు లక్ష్మయ్య, యానమోని తిరుపతయ్య, గూల్ల చెన్నకేశవులు, తవిటి నిరంజన్, తవిటి నర్సింహ, తెప్ప రుద్రయ్య, తవిటి శంకర్, గువ్వల వెంకటయ్య, చాపల వెంకటయ్య, జంగయ్య, కొండమోని సైదయ్య, పూలమోని పర్వతాలు, పులమొని కరుణాకర్, తెప్ప రాజేందర్, బచ్చలి వెంకటస్వామి, గుండూరు శంకర్, అయినమౌని రాము, తుమ్మల నాగేష్, డోకూరి నిరంజన్, డోకూరి నారాయణ, సొప్పరి యాదయ్య, కనక సత్యం, లక్ష్మయ్య, సంద శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డా. పెబ్బేటి మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్









Leave a Reply