ఎల్ఐసీలో ఉత్తమ సేవలకు గుర్తింపుగా సన్మానం
దేవరకొండ, సెప్టెంబర్ 10 (అయుష్ 24 న్యూస్): పనిని ప్రేమిస్తూ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు సహజంగానే వస్తాయని పలువురు వక్తలు అన్నారు. సంస్థ అభివృద్ధికి కృషి చేసే ఉద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
దేవరకొండ ఎల్ఐసీ బ్రాంచ్‌లో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.జె. క్రాంతికుమార్ పదోన్నతిపై కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి డివిజన్‌కు బదిలీ అవుతున్న సందర్భంగా గురువారం బ్రాంచ్ కార్యాలయంలో సిబ్బంది, ఎల్ఐసీ ఏజెంట్లు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా లభిస్తుందని, క్రాంతికుమార్ అందుకు ఉదాహరణగా నిలిచారని అన్నారు. 2020లో సంస్థలో అసిస్టెంట్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆయన తక్కువ సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగి, ఒకే సంవత్సరంలో మూడు పదోన్నతులు పొందారని ప్రశంసించారు.
ఎల్ఐసీ కార్యాలయ సిబ్బంది, ఏజెంట్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, సంస్థ బలోపేతానికి తనవంతు కృషి చేశారని తెలిపారు. పాలసీల విస్తరణలోనూ క్రాంతికుమార్ చేసిన కృషిని పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ.. దేశంలో ప్రముఖ బీమా సంస్థగా ఉన్న ఎల్ఐసీలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పాలసీదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఎల్ఐసీ సిబ్బంది, ఏజెంట్లు ముందుండాలని సూచించారు.
క్రాంతికుమార్‌ను సన్మానించిన ఇమ్మడి భద్రయ్య
ఎల్ఐసీలో విశిష్ట సేవలు అందించి అందరి మన్ననలు పొందిన క్రాంతికుమార్ పదోన్నతిపై ఉడిపి డివిజన్‌కు వెళ్తున్న సందర్భంగా ఎల్ఐసీ జెడ్ఎం క్లబ్ మెంబర్ ఇమ్మడి భద్రయ్య ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఇమ్మడి భద్రయ్య మాట్లాడుతూ.. క్రాంతికుమార్ ఎక్కడ పనిచేసినా సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ ఆర్. శివకృష్ణ, జెడ్ఎం క్లబ్ మెంబర్, ఎల్ఐసీ ఏజెంట్ ఇమ్మడి భద్రయ్య, ఏజెంట్లు కొణిదల దశరథం, గుత్త తిరుమలరెడ్డి, మంచికంటి జగన్మోహన్, ఎల్ఐసీ అధికారులు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఏజెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Musini.Anjan





Leave a Reply