పద్మశాలి ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించిన రాష్ట్ర పద్మశాలి సంఘం
దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు రాజకీయాల్లో మరింతగా రాణిస్తూ సమాజ అభివృద్ధికి బాసటగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి అన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పద్మశాలి సోదర సోదరీమణులకు శనివారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఇటీవల ఎన్నికైన పున్న శైలజ వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ పులిజాల భవాని జానీలను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలి సమాజం విద్య, వ్యాపారం, ఉద్యోగాలు, రాజకీయాలు తదితర రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. రాజకీయ రంగంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
అదేవిధంగా పద్మశాలి సమాజానికి సంప్రదాయంగా ఉన్న చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరగకపోవడంతో ఆ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని వారు అభిప్రాయపడ్డారు.
చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పద్మశాలి నాయకులు తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేయడంతో పాటు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు, పద్మశాలి ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply