సెప్టెంబర్ 4న పరిగిలో భారీ బైక్ ర్యాలీ.. అనంతరం శ్రీకృష్ణాష్టమి పూజల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే
పరిగి, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డా. టీ. రామ్మోహన్రెడ్డి (TRR) శుక్రవారం పరిగి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.
🏍️ ఉదయం 11 గంటలకు భారీ బైక్ ర్యాలీ
కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల ప్రజాపాలన సందర్భంగా పరిగి పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే డా. టీ. రామ్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
ర్యాలీ మార్గం:
ఎమ్మెల్యే TRR నివాసం → బాహర్పేట్ హనుమాన్ టెంపుల్ → పోస్ట్ ఆఫీస్ → కోర్టు రోడ్డు → డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం
🦚 మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకృష్ణాష్టమి పూజలు
అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పరిగి పట్టణంలోని 8వ వార్డులో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. టీ. రామ్మోహన్రెడ్డి పాల్గొంటారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తలు, అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply