Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › పరిగి పట్టణంలో ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 133వ జయంతి
బ్రేకింగ్ న్యూస్

పరిగి పట్టణంలో ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 133వ జయంతి

12:46 మధ్యాహ్నం PM

సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, హైదరాబాద్ మాజీ మేయర్ సేవలను స్మరించుకున్న ముదిరాజ్ సంఘం నాయకులు

పరిగి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, హైదరాబాద్ మాజీ మేయర్ దివంగత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 133వ జయంతి వేడుకలను పరిగి పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ పరిగి పట్టణ కమిటీ అధ్యక్షుడు దోమ శ్రీశైలం ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, పెద్దలు కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్, ఉపాధ్యక్షుడు హన్మంత్ ముదిరాజ్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 4న కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 133వ జయంతి సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ సమాజం తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ముదిరాజ్ సమాజంలో ఐక్యత, విద్య, సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి, పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాద్ సామాజిక, రాజకీయ, విద్యా, పాత్రికేయ రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకుడిగా సంఘం నాయకులు గుర్తుచేశారు. కార్యకర్తగా, రచయితగా, పాత్రికేయుడిగా, విద్యావేత్తగా, మున్సిపల్ కౌన్సిలర్‌గా ఆయన సేవలందించారని తెలిపారు. 1957–58 కాలంలో హైదరాబాద్ మేయర్‌గా పనిచేశారని పేర్కొన్నారు.

పేద ముదిరాజ్ కుటుంబంలో జన్మించిన కృష్ణస్వామి ముదిరాజ్ కష్టపడి విద్యాభ్యాసం కొనసాగించారని, చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్, నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారని తెలిపారు. అనంతరం బొంబాయిలో ముద్రణ, ప్రచురణ సాంకేతికతపై శిక్షణ పొందారని పేర్కొన్నారు.

కొంతకాలం నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి మహారాజ్ కిషన్ ప్రసాద్ వద్ద ప్రైవేట్ కార్యదర్శిగా, అనంతరం ఆడిటర్ జనరల్ కార్యాలయంలో పనిచేశారని వివరించారు.

పత్రికా, ప్రచురణ రంగానికి విశేష కృషి

కృష్ణస్వామి ముదిరాజ్‌కు చరిత్ర, జర్నలిజం, ప్రచురణ రంగాలపై ప్రత్యేక ఆసక్తి ఉండేదని నాయకులు తెలిపారు. ‘డెక్కన్ స్టార్’ ఆంగ్ల పత్రికలో పనిచేశారని, ‘మసావత్’, ‘న్యూ ఎరా’ వంటి ఉర్దూ పత్రికలకు సంపాదకత్వం వహించారని పేర్కొన్నారు. ‘సియాసత్’, ‘రయ్యత్’, ‘రహనుమా-ఎ-దక్కన్’, ‘ఎమ్రోజ్’ వంటి పత్రికల్లో వ్యాసాలు రాశారని తెలిపారు.

1925లో స్వంత ముద్రణాలయాన్ని స్థాపించి, 1929లో ‘Pictorial Hyderabad’ గ్రంథాన్ని ప్రచురించారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, భవనాలు, ప్రముఖ వ్యక్తుల వివరాలను నమోదు చేసిన ఈ గ్రంథం చారిత్రక ప్రాధాన్యత కలిగిన రచనగా నిలిచిందని తెలిపారు.

ముదిరాజ్ సమాజానికి సేవలు

1922లో ముదిరాజ్ మహాసభను స్థాపించి, సమాజంలో ఐక్యత, విద్య, సామాజిక చైతన్యం పెంపొందించేందుకు కృష్ణస్వామి ముదిరాజ్ కృషి చేశారని నాయకులు గుర్తుచేశారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గ సంఘం అధ్యక్షుడు రామస్వామి ముదిరాజ్, ఉపాధ్యక్షుడు శేరి బిచ్చయ్య, రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు కె. హనుమంత్ ముదిరాజ్, పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్ ముదిరాజ్, పరిగి నియోజకవర్గ యువత అధ్యక్షుడు పర్షమోని బాబు ముదిరాజ్, పరిగి పట్టణ అధ్యక్షుడు దోమ శ్రీశైలం ముదిరాజ్, సంఘం నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, కుడుముల యాదయ్య, సంతోష్ ముదిరాజ్, దోమ ప్రవీణ్ ముదిరాజ్, నవీన్ ముదిరాజ్, నరేష్ ముదిరాజ్, బందయ్య ముదిరాజ్, అనిల్ ముదిరాజ్, దోమ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 5🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *