– పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి
పరిగి, ఆగస్టు 25, ఆయుష్ 24 న్యూస్
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు.
పరిగి పట్టణంలోని సంకల్ప విద్యాపీఠ్ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడటంలో వనమహోత్సవ కార్యక్రమాలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు.
మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, అవి పెరిగే వరకు నిరంతరం సంరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్
www.ayush24news.com










Leave a Reply