మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం
మంథని, ఆగస్టు 30: ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, విషాద సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మంథని మున్సిపల్ పరిధిలో ఇటీవల మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్‌కే రాజు యాదవ్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అలాగే ఇటీవల మృతి చెందిన గంట రవి కుమారుడి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

మంథని మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బొడ్డు చంద్రయ్య కుటుంబ సభ్యులను, మంథని 8వ కాలనీలో ఇటీవల మృతి చెందిన బత్తిని శ్రీనివాస్ తల్లి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.

అదేవిధంగా కరీంనగర్‌లోని రాంపల్లి ప్రాంతంలో ఇటీవల మృతి చెందిన రాంపల్లి రాధమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్యంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాగోని లక్ష్మీనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులను కూడా మంత్రి పరామర్శించి సానుభూతి తెలిపారు.
కోయడ మండలం శనివారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్ తల్లి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి ఆకాంక్షించారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply