నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
మంథని, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): మంథని నియోజకవర్గ పరిధిలో పలు వివాహ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్ల బాలాజీ–గీత దంపతుల కుమారుడి వివాహ వేడుకకు హాజరైన నాయకులు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

అలాగే మంథని పట్టణానికి చెందిన తోట ప్రవీణ్ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
మంథని పట్టణంలోని శ్రీపాద కాలనీకి చెందిన గోవిందుల రమేష్ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలోనూ నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి, రావికంటి సతీష్, ముత్తారం మండల మహిళా అధ్యక్షురాలు గోవిందుల పద్మ, ఆనంద్, సీనియర్ నాయకులు అజీమ్ ఖాన్, ఆకుల శ్రీనివాస్, మబ్బు తిరుపతి, వోల్లాల నాగరాజు, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply