జీవో నం. 97ను రద్దు చేయాలని డిమాండ్
వికారాబాద్, అయుష్ 24 న్యూస్: వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు నిర్వహించనున్న ధర్నాకు హాజరై, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ రాజేందర్ గౌడ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
వికారాబాద్‌లోని ఆయన నివాసంలో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు రాజేందర్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుండగా, వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తనను ముందస్తుగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని రాజేందర్ గౌడ్ ఆరోపించారు.
విద్యార్థుల ఆందోళనలను అణచివేయడం కాకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన అన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, వారి డిమాండ్లను నెరవేర్చడంతో పాటు జీవో నం. 97ను తక్షణమే రద్దు చేయాలని రాజేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.
అయుష్ 24 న్యూస్
నిజం మా ధ్యేయం… ప్రజలే మా బలం…










Leave a Reply