పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. గణేష్ డిమాండ్
టేకులపల్లి, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: పాలిటెక్నిక్ విద్యను శక్తిలో విలీనం చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. గణేష్ డిమాండ్ చేశారు.
టేకులపల్లిలో మంగళవారం పీడీఎస్‌యూ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జె. గణేష్ మాట్లాడుతూ.. కేంద్రం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాలిటెక్నిక్ విద్యను శక్తిలో కలిపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు.
పాలిటెక్నిక్ విద్యలో అనేక మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తూ తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారని, ఇటువంటి నిర్ణయాలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని జె. గణేష్ పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు పీడీఎస్‌యూ నిరంతరం పోరాటం చేస్తుందని, అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply