ఆభరణాలు, నగదు అపహరించినట్లు సమాచారం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పెదకాకాని, సెప్టెంబర్ 7 – అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. డి. కోటేశ్వరమ్మ (47) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం.
హత్య అనంతరం ఆమె వద్ద ఉన్న ఆభరణాలు, నగదును అపహరించినట్లు ప్రాథమిక సమాచారం. కోటేశ్వరమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిసింది.
ఆధారాల సేకరణలో పోలీసులు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, ఘటనకు పాల్పడిన వ్యక్తుల వివరాలను గుర్తించేందుకు పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి, నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఘటనకు దారితీసిన కారణాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికావాల్సి ఉంది.
అయుష్ 24 న్యూస్










Leave a Reply